మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి


Sat,March 23, 2019 11:36 PM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ : నర్సారీలలో మొక్కల పంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి నర్సయ్య అన్నారు. శివ్వంపేట మండలంలోని నర్సరీలను శనివారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి నర్సయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నర్సరీలలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను పరిశీలించారు. అనంతరం ఆయన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు, టీఏతో పాటు వన సేవకులకు పలు సూచనలు చేశారు. మొక్కలు ఏపుగా పెరుగడానికి కావాల్సిన ఎరువులు, కీటకనాసినీల వాడకంపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నవీన్‌కుమార్, ఏపీవో అనిల్‌కుమార్, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏతో పాటు వన సేవకులు ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...