క్షయవ్యాధి నివారణపై అవగాహన


Sat,March 23, 2019 11:36 PM

వెల్దుర్తి: అంతర్జాతీయ క్షయ వ్యాధి నివారణ దినాన్ని పురస్కరించుకుని శనివారం మండల కేంద్రమైన వెల్దుర్తిలో ఏఎన్‌ఎం పద్మ ఆధ్వర్యంలో పాఠశాల నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి వస్తే గుర్తించాల్సిన లక్షణాలను ప్రజలకు వివరించామన్నారు. చాలా రోజులుగా జ్వరంతో బాధపడడం, తీవ్రమైన దగ్గు, సాయంత్రం వేళ జ్వరం అధికం కావడం వంటివి వ్యాధి లక్షణాలని, ఆ లక్షణాలు కనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో క్షయ వ్యాధి మందులు లభిస్తాయని ఆమె తెలిపారు. ఈ ర్యాలీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చేగుంట: క్షయ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తూప్రాన్ డివిజన్ నేత్రాధికారి రమేశ్ పేర్కొన్నారు. ఈనెల 24న ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా చేగుంటలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి నివారణకు తీసుకునే చర్యలను వివరించి, వైద్యసిబ్బందితోప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రెడ్డిపల్లిలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో క్షయ వ్యాధి నివారణపై విద్యార్థులకుకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చేగుంట ప్రాథమిక వైద్యాధికారి వినేకుమార్, తూప్రాన్ డివిజన్ ఆరోగ్య బోధకులు అనిత, ఆరోగ్య సిబ్బంది రాజిరెడ్డి, పగడయ్య తదితరులున్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...