16 ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్‌కే..


Sat,March 23, 2019 11:36 PM

తూప్రాన్ రూరల్ : రాష్ట్రంలో 16 పార్లమెంట్ స్థానాలు టీఆర్‌ఎస్‌కే దక్కుతాయని, కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు కేంద్రాన్ని శాసించే సత్తా ఒక్క టీఆర్‌ఎస్ పార్టీకే ఉందని రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కంటే రెట్టింపు మెజార్టీతో మెదక్ స్థానంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకుంటామన్నారు. తూప్రాన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలిపించుకుంటే కేంద్రంలో ప్రధాన మంత్రి అభ్యర్థి ఎంపికలో టీఆర్‌ఎస్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు మరిన్ని నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ రాష్ర్టానికి చేసిందేమి లేదన్నారు. ఐదేండ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు.

సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు సజావుగా అమలు జరుగుతున్నాయన్నారు. దేశం యావత్ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పథకాల వైపే చూస్తుందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. రైతుబంధు, రైతుజీవిత బీమా, ఆసరా పింఛన్ల వంటి పథకాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి కటుంబానికి లబ్ధి చేకూరిందన్నారు. ఇండ్లులేని నిరుపేదలకు డబుల్‌బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూప్రాన్ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్, ఆత్మకమిటీ వైస్ చైర్మన్ బాబుల్‌రెడ్డి, డైరెక్టర్ భిక్షపతి, నాచారం దేవస్థానం డైరెక్టర్ మామిడీ వెంకటేశ్, టీఆర్‌ఎస్ నాయకులు ఉపేందర్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...