టీఆర్‌ఎస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ సాధించి పెట్టాలి


Sat,March 23, 2019 11:36 PM

తూప్రాన్ రూరల్ : మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ వచ్చేలా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మరో 20రోజుల పాటు టీఆర్‌ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని గ్రామస్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలకు వారు సూచించారు. సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు చిట్కూల్ మహిపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు సిందె చంద్రంతో పాటు పలువురు టీఆర్‌ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు నగరంలోని వారి నివాసాల్లో శనివారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును వారు వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మహిపాల్‌రెడ్డిని వారు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలదేనన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసే దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించుకుంటే కేంద్రం నుంచి రాష్ర్టానికి జరుగబోయే ప్రయోజనాల గురించి ప్రజలకు స్పష్టంగా తెలియజెప్పాలన్నారు.మరో 20 రోజులు కష్టపడి ఎంపీ అభ్యర్థులను గెలిపించుకున్నట్లయితే మరో ఐదేండ్ల వరకు రాష్ర్టానికి కావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 16 ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటే కేంద్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...