టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ..


Sat,March 23, 2019 01:16 AM

- రెండు సెట్ల నామినేషన్ దాఖలు
మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మెదక్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను మెదక్ కలెక్టరేట్‌లో ఎన్నికల కార్యాలయంలో దాఖలు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి నామినేషన్ పత్రాలను మెదక్ కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి ధర్మారెడ్డికి నామినేషన్ పత్రాలు అందించారు. మొదటి నామినేషన్ పత్రాలు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆధ్వర్యంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేంవేందర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి , ఎమ్మెల్సీ ఫారుక్‌హుస్సేన్‌తో కలిసి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రెండోసెట్ నామినేషన్ పత్రాలను ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాజమణి మురళీయాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్యతో కలిసి ఎన్నికల అధికారి ధర్మారెడ్డికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కార్యక్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, బ్రెవరేస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాదరావు, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ మడుపు భూంరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, ఎంపీపీలు పుట్టి విజయ లక్ష్మి, శ్రీనివాస్‌రావు, హరికృష్ణ, జెడ్పీటీసీలు లావాణ్యరెడ్డి, బిజ్జె విజయ లక్ష్మి, దేవేందర్‌రెడ్డితో పాటు రాష్ట్ర, జిల్లా , మండలస్థాయి నేతలు కలెక్టరేట్ వరకు తరలి వచ్చారు. అభ్యర్థితో పాటు నలుగురిని ఎన్నికల కార్యాలయంలోకి అనుమతించడంతో నేతలందరూ కలెక్టరేట్ బయటనే ఉండిపోయారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...