ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు


Sat,March 23, 2019 01:16 AM

చేగుంట: శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు జరిగింది. చేగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని మెదక్ జాయింట్ కలెక్టర్ నగేశ్ పరిశీలించగా, నార్సంగి పోలింగ్ కేంద్రాన్ని తూప్రాన్ ఆర్డివో శ్యాంప్రకాశ్ పరిశీలించారు. చేగుంటలో పోలింగ్ బూత్‌కు సంబంధించి 499 మంది పట్టభద్రులకు గాను 318మంది, 90మంది ఉపాధ్యాయులకు గాను 88మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నార్సంగి మండలంలో 112 మంది పట్టభద్రులకు గాను 69మంది, 10ఉపాధ్యాయులకు గాను 6 మంది ఉపాధ్యాయులు, పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రికార్డులను పరిశీలించిన జేసీ నగేశ్...
మండల కేంద్రమైన చేగుంటలోని తహసీల్దార్ కార్యాలయంలో భూరికార్డులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ సమస్యలను పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ నగేశ్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. జేసీ వెంట తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, చేగుంట తహసీల్దార్ ఎన్ గోవర్ధన్, వీఆర్‌వోలు ఉన్నారు.

తూప్రాన్‌లో పోలింగ్ కేంద్రం పరిశీలన
తూప్రాన్ రూరల్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయని జాయింట్ కలెక్టర్ నగేశ్ అన్నారు. తూప్రాన్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సరళి గురించి తూప్రాన్ తహసీల్దార్ శ్రీదేవిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జిల్లాలో 22 ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్‌తో పాటు నలుగురు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌లు విధులు నిర్వర్తించారన్నారు. జిల్లాలో 210 మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొన్నారన్నారు. మూడు మండలాలకు ఒక జోన్ వంతున జిల్లాలో 7 జోన్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సాయంత్రం 4 గంటలలోపు పోలింగ్ కొనసాగిందని, తర్వాతా పోలింగ్ ఆఫీసర్‌లు ఆర్డీవో కార్యాలయాలకు బ్యాలెట్ బాక్స్‌లు తరలిస్తారన్నారు. ఆర్డీవో కార్యాలయాల నుంచి నేరుగా కరీంనగర్‌కు వాటిని తరలించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ జేసీ నగేశ్‌లు పోలింగ్ సరళిపై చర్చించారు. అంతకుముందు తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్ తూప్రాన్‌లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ తహసీల్దార్ శ్రీదేవి, సీఐ లింగేశ్వర్‌రావు, ఎస్‌ఐలు సుభాష్, ఎల్లాగౌడ్, ఆర్‌ఐ రాజశేఖర్, వీఆర్వోలు గణేశ్, వెంకటేశ్, హరీశ్, నర్సింహులుతో పాటు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...