కరీంనగర్‌కు బ్యాలెట్ బాక్సులు


Sat,March 23, 2019 01:16 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మెదక్ జిల్లాలోఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలు జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగాయి. జిల్లాలో పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ శాతం 65.38నమోదు కాగ, ఉపాధ్యాయుల పోలింగ్ 88.05 శాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 5818 పురుషులు, 1889 మహిళలలు, మొత్తం 7707 మంది ఓటర్లు ఉండగా పురుషులు 3915, స్త్రీలు 1124, మొత్తం 5039 ఓట్లు నమోదయ్యాయి. ఉపాధ్యాయుల ఓట్లు పురుషులు 768, స్త్రీలు 379, మొత్తం 1147 ఉండగా పురుషులు 683, స్త్రీలు 327, మొత్తం 1010 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జిల్లాలో ముగ్గురు ఆర్డీవోలు సహాయ ఎన్నికల అధికారులుగా విధులు నిర్వహించారు. మెదక్, నర్సాపూర్, తూప్రాన్‌ల ఆర్డీవోలు సాయిరాం, ఆరణారెడ్డి, శ్యాంప్రసాద్‌లు ఎన్నికల పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. మెదక్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొండల్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళలిని ఎప్పటికప్పుడు సహాయ ఎన్నికల అధికారులు పరిశీలించారు.

బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ కౌంటింగ్ కేంద్రాలకు తరలింపు
జిల్లాలో పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కొనసాగింది. పోలింగ్ అనంతరం పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఆర్డీవోలకు అందించారు. అనంతంరం బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...