నేటి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


Fri,March 22, 2019 12:15 AM

తూప్రాన్ రూరల్ : ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం జరుగనున్న ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ప్రిసైడింగ్,అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌లు వ్యవహరించాలని తూప్రాన్ ఆర్డీవో, తూప్రాన్ డివిజన్ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ శ్యాంప్రకాశ్ అన్నారు. తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం డివిజన్ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి,చేగుంట, నార్సింగి మండలాల ప్రిసైడింగ్,అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వాహణలో అధికారులు నిర్వర్తించాల్సిన విధివిధానాల గురించి సిబ్బందికి ఆయన అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల నిర్వాహణ కోసం 5 మండలాల్లో 6 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 35 మంది సిబ్బందిని నియమించామన్నారు.

వీరిలో 5 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్(పీవో)లు, 5మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్(ఏపీవో)లు, మరో 5 మంది మైక్రో అబ్జర్వర్‌లుగా ఉంటారన్నారు.డివిజన్ పరిధిలోని తూప్రాన్,మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, వెల్దుర్తి మండలాల్లో ఉపాధ్యాయులు 269 మంది, పట్టభద్రులు 1,341 మంది ఓరర్లు ఉన్నారన్నారు. ఉపాధ్యాయ స్థానంలో తూప్రాన్ మండలంలో 145 మంది, మనోహరాబాద్ మండలంలో 14 మంది, చేగుంట మండలంలో 90 మంది, వెల్దుర్తి మండలంలో 10 మంది, నార్సింగి మండలంలో 10 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అలాగే పట్టభద్రుల స్థానంలో తూప్రాన్ మండలంలో 487 మంది, మనోహరాబాద్ మండలంలో 111 మంది, చేగుంట మండలంలో 499 మంది, వెల్దుర్తి మండలంలో 132 మంది, నార్సింగి మండలంలో 112 మంది ఓటరర్లు ఉన్నారన్నారు.

తూప్రాన్‌లో జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్, మనోహరాబాద్‌లో ప్రైమరీ స్కూల్,వెల్దుర్తి,నార్సింగిలో జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూళ్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.అయితే చేగుంట మండలంలో జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్‌లో ఉపాధ్యాయులు,పట్టభద్రులకు వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు,విద్యాశాఖ నుంచి జారీ చేయబడిన సర్వీస్ ఐడెంటీ కార్డు,యూనివర్సిటీ నుంచి అందజేయబడిన డిగ్రీ,డిప్లొమా సర్టిఫికెట్, ఆధార్‌కార్డ్‌లో ఏదైనా ఒక గుర్తింపు కార్డును ఓటర్లు తమవెంట తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో తూప్రాన్ ఇన్‌చార్జి కమిషనర్ రాఘవరావు, డివిజన్ పరిధిలోని తహసీల్దార్‌లు శ్రీదేవి, సాయాగౌడ్,గోవర్ధన్,జానకీ,కృష్ణవేణి,ఆర్డీవో కార్యాలయం డీఏవో ఇంద్రాణి,నాగరాజు,తూప్రాన్ ఆర్‌ఐ రాజశేఖర్, వీఆర్వోలు గణేశ్, వెంకటేశ్, హరీశ్,నర్సింహులుతో పాటు ఆయా మండలాలకు చెందిన రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు..

నర్సాపూర్,నమస్తే తెలంగాణ: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డివిజన్ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూరైనట్లు ఆర్డీవో అరుణారెడ్డి తెలిపారు. శుక్రవారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలు ఇచ్చారు. ఎన్నికలను సమర్ధవంతంగా జరుపాలని సూచించారు. ఏలాంటి ఘటనలు జరుగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. నర్సాపూర్ డివిజన్ పరిధిలోని నర్సాపూర్, కౌడిపల్లి, శివ్వంపేట, కొల్చారం, చిలిపిచెడ్ మండలాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4గంటలకు ముగుస్తుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం డివిజన్‌లో మొత్తం 1525 మంది పట్టభద్రులు, 169 మంది ఉపాధ్యాయులు ఉన్నారని నర్సాపూర్ మండలంలో 560 మంది పట్టభద్రులు, 101 మంది ఉపాధ్యాయులు ఎన్నికలలో ఓటు హక్కును వినియో గించుకోనున్నాట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 5 మంది చొప్పున ఎన్నికల సిబ్బందిని నియమించగా వారు ఆయా మండలాల పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లినట్లు తెలిపారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...