ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం


Fri,March 22, 2019 12:14 AM

టేక్మాల్: నేడు జరుగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బంది సాయంత్రానికి పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సామగ్రితో చేరుకున్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను వారు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు పోలింగ్ సిబ్బందికి సహకారాన్ని అందించారు. టేక్మాల్ ఎస్సై విజయ్‌రావు పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఏఎస్సై, పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

పెద్దశంకరంపేటలో...
పెద్దశంకరంపేట: ఈనెల 22న జరుగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ కిష్టానాయక్ గురువారం తెలిపారు. పెద్దశంకరంపేట బాలికల ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పట్టభద్రుల పోలింగ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ బాలికల ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందన్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలకు సంభందించిన పోలింగ్ చీటీలను ఓటర్లకు పంపిణీ చేశామన్నారు. మండలంలో 233 మంది పట్టభద్రులు, 49 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారన్నారు. వీరికి వీఆర్వోల ద్వారా పోలింగ్ చీటీలను పంపిణీ చేశామన్నారు.

పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తన నియమావళి
అల్లాదుర్గం:ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలవుతుందని ఆర్డీవో సాయిరాం అన్నారు. శుక్రవారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నిలకు సంబంధించి గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్,మరుగుదొడ్లు,ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎన్నికల నియమాలను అందరు పాటించాలని,లేనిచో చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట తహసీల్దార్ హరితాదేవి,డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ వాహేద్, ఎన్నికల అసిస్టెంట్ ప్రిసైడింగ్, అధికారి ప్రవీణ్,వీఆర్‌వో కిషన్, ఉన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...