కొనసాగుతున్న అనంత పద్మనాభస్వామి జాతర


Fri,March 22, 2019 12:13 AM

పాపన్నపేట : మండల పరిధిలోని కొత్తపల్లిలో అనంత పద్మనాభస్వామి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. స్థానిక సర్పంచ్ కుమ్మరి జగన్ ఆధ్వర్యంలో అనంతపద్మనాభస్వామి కల్యాణం గురువారం పద్మనాభస్వామి గుట్ట మీద నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాదేవి దేవస్థానం నుంచి పాలక మండలి చైర్మన్ పట్లోళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి పట్టు వస్ర్తాలు స్వామివారికి సమర్పించారు. విశ్వనాథ శర్మ, వేద పండితులు వేదమంత్రోశ్చరణల మధ్య స్వామి వారికి కల్యాణం వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మాజీ మార్కెట్ కమిటీ సభ్యులైన రాజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గురువారం సాయంత్రం అనంత పద్మనాభస్వామి జాతరను సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, పాపన్నపేట టీఆర్‌ఎస్ నాయకులు ప్రశాంత్‌రెడ్డి, రమేశ్, దుర్గయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...