ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం


Fri,March 22, 2019 12:13 AM

వెల్దుర్తి: నేడు జరుగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం మండల కేంద్రమైన వెల్దుర్తిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల జోనల్ అధికారి, తహసీల్దార్ జానకి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. మండలంలో 132 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా, పోలింగ్ స్టేషన్ 184ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 10 మంది ఉపాధ్యాయులు ఉండగా వారి కోసం పోలింగ్ కేంద్రం 159 ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గం టల వరకు నిర్వహించనున్నామని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కాగా నేడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కో సం గురువారం ఎన్నికల సిబ్బంది తమ పోలింగ్ సామగ్రితో ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు. ఎన్నికల సిబ్బందితో కలిసి జోనల్ అధికారి జానకి ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...