మురళీయాదవ్‌ను పరామర్శించిన మాజీ మంత్రి హరీశ్‌రావు


Thu,March 21, 2019 12:04 AM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్‌కు కొన్ని రోజుల కిందట భుజానికి ప్యాక్చర్ కావడంతో డాక్టర్ల సలహామేరకు నగరంలోని సన్‌షైన్ దవాఖానలో చికిత్స పొందుతూ ఇటీవల ఆపరేషన్ చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌లు బుధవారం దవాఖానకు వెళ్లి పరామర్శించారు. ఈ సమయంలో జెడ్పీచైర్‌పర్సన్ రాజమణి, నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటన్ సుధీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

156
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...