నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి


Wed,March 20, 2019 12:06 AM

రేగోడ్: వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం రేగోడ్ మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ మమత అధ్యక్షతన నిర్వహిచారు.ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ ఎండా కాలంలో నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.తాగునీటి సమస్యతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయో రోజుల్లో నీటి వాడకం అధికంగా ఉంటుందని,అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టాలన్నారు.నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో బోర్లు వేయడానికి అనుమతి లేదని,బోర్లు వేయ డం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయన్నారు.వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని పైప్ లైన్ ద్వారా ట్యాంకులకు నీటి సరఫరా చేసుకోవాలని సూచించారు.నీటి సమస్యను పరిష్కరించేందుకు సర్పంచు లు,అధికారులు కృషి చేయాలన్నారు.

108 ఆంబులెన్స్‌ను ఏర్పాటు చేయండి
రేగోడ్ మండలానికి 108 ఆంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని ఆర్ ఇటిక్యాల సర్పంచ్ అనిల్‌కుమార్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.మండలంలో 108 లేకపోడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు అల్లాదుర్గం,నారాయణఖేడ్ నుంచి 108 వాహనాలు ఆలస్యంగా రావడంతో ప్రాణాలు పోయే పరిస్థితి ఉందన్నారు.గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉన్నాయని,సర్వసభ్య సమావేశంలో సమస్యలపై చర్చించేందుకు విద్యు త్ శాఖ అధికారులు రావడం లేదని సభ్యులు మండిపడ్డారు.మిషన్ భగీరథ పనుల్లో భాగంగా పైప్‌లైన్ ఏర్పాట్ల కోసం గుంతలు తీస్తున్నారని తర్వాత పూడ్చడం లేదని దీంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు.
ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌కు సన్మానం
అందోల్ ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారిగా రేగోడ్ మండల సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌కు మండల ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.రేగోడ్ ప్రెస్‌క్లబ్ అధ్వర్యంలో ఎమ్మెలేకు మొక్కను అందజేసి సన్మానించారు, కార్యక్రమంలో ఎంపీడీవో లచ్చాలు,జెడ్పీటీసీ రాంరెడ్డి,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్,కోఆప్షన్ మెంబర్ మోహిజోద్దిన్,ఎంపీటీసీ సభ్యులు,సర్పంచులు పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...