బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలి


Wed,March 20, 2019 12:06 AM

పెద్దశంకరంపేట : బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని నాబార్డ్ డీడీఎం సెసిల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగరాజు అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట పట్టణంలో అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, గడిపెద్దాపూర్, ధన్నూర, పెద్దశంకరంపేటలోని బ్యాంక్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, ఐకేపీ, మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాబార్డ్ అందించే రుణాలతో పాటు ముద్ర రుణాలు, ఎస్‌హెచ్‌జీ రుణాలు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌కు సంబంధించి 2018-19కి గాను గ్రౌండింగ్ చేసిన రుణాలపై చర్చించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 3069 మంది ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరికి ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారికి బ్యాంకు పోర్టల్ నుంచి రుణాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య తెలిపారు. ఇందులో అర్హులైన వారిలో ఆయా ట్రేడ్‌లలో గుర్తింపు పొందిన ధ్రువీకరణపత్రాలు కలిగిన వారికి మొదటగా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 50 శాతం ఎంపీడీవో పరిధిలో మిగతా 50శాతం జిల్లా పరిషత్ రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నాబార్డు డీడీఎం సెసిల్ మాట్లాడుతూ డైరీ జేఎల్‌జీ (జాయింట్ లాయిబులిటీ గ్రూప్) సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రుణాలు ఇవ్వనున్నామన్నారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీతో 4 నుంచి 10 మంది కలిసి గ్రూపుగా ఏర్పాటైన వారికి రుణాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వసంత్‌రావు, ఆయాశాఖల బ్యాంకు మేనేజర్లు జయరాముడు, పండు, శాంతకుమార్, అభినవ్, ఎంపీడీవో భన్సీలాల్, ఐకేపీ సీసీలు శేఖర్‌రాయ్, యోహన్ తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...