జైళ్లను సందర్శించిన జైలు శాఖ అధికారులు


Wed,March 20, 2019 12:05 AM

సంగారెడ్డి మున్సిపాలిటీ : తెలంగాణ జైళ్ల సంస్కరణల అమలులో ఉన్నాయని, ఖైదీల శక్తి సామర్థ్యాలను వారికి ఉపయోగకరమైన రీతిలో అభివృద్ధికి వినియోగించడం శుభ పరిణామని పంజాబ్ జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ అరోర అన్నా రు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఉత్తర, పశ్చిమ భార త రాష్ర్టాల జైలు అధికారుల సమావేశంలో పాల్గొంటున్న ఐదుగురు అధికారులు మంగళవారం సంగారెడ్డి హెరిటేజ్ జైలు మ్యూజియం, కందిలోని జిల్లా జైలును సందర్శించారు. ఈ సందర్భంగా అరోర మాట్లాడుతూ జైల్లో అమలు చేస్తున్న శిక్షణ, ఉత్పత్తి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. దీని కోసం జైలు అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి అద్బుతం అన్నారు. జైలు పరిసరాలను చూసి ప్రశంసించారు.
జైలులో అమలు చేస్తున్న కార్యక్రమాలను, జైలుకు సంబంధించిన సమాచారాన్ని జైలు పర్యవేక్షణాధికారి నవాబ్ శివకుమార్‌గౌడ్ అరోరాకు వివరించారు. కార్యక్రమంలో జమ్ముకాశ్మీర్ జైళ్ల శాఖ సూరింటెండెంట్ రజని సెహగల్, హర్యానా జైల్ సూపరింటెండెంట్ సోమనాథ జగత్, ఢిల్లీ జైళ్ల డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రదీప్ శర్మ, గుజరాత్ రాష్ట్రం నుంచి ఇద్దరు జైలర్లు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...