ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి


Tue,March 19, 2019 01:06 AM

రేగోడ్ : వైద్యశాలల నిర్వహణలో ప్రభుత్వం నిర్దేశిస్తున్న అన్ని లక్ష్యాలను తప్పకుండా నెరవేర్చాలని డీఎంఎచ్‌వో వెంక ఆదేశించారు. మండల కేంద్రం రేగోడ్‌లోని దవాఖానను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ఇతర రికార్డులను పరిశీలించిన అనంతరం సమావేశం నిర్వహించి మాట్లాడారు. పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా వసతులను కల్పించి మెరుగైన సేవలను అందిస్తుందన్నారు. ఆరోగ్య సిబ్బంది దవాఖానల నిర్వహణ, వైద్య సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదన్నారు. పరిసరాల పరిశువూభతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాన్పుల నిర్దేశిత లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు నెరవేర్చేందుకు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ వైద్యాన్ని మరింతగా ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో భాగంగా సేవాదృక్పథంతో పని చేయాలని ఆయన కోరారు. కార్యక్షికమంలో జిల్లా క్వాలిటీ అస్యూన్స్ అధికారి అశోక్, వైద్యాధికారులు అంబిక, శ్వేత, హెల్త్ సూపర్‌వైజర్ ఈశ్వర్‌గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...