ఎమ్మెల్సీ ‘శేరి’కి ఘన స్వాగతం


Tue,March 19, 2019 01:04 AM

పట్టభవూదులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటా

మెదక్, నమస్తే తెలంగాణ : పట్టభవూదులకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభవూదుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ కింది స్థాయి నుంచి గ్రూప్ వన్ అధికారిగా విధులు నిర్వహించిన తమకు ఉద్యోగుల సమస్యలు తెలుసునన్నారు. పట్టభవూదులతో పాటు ఉద్యోగ సంఘాలకు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇంకా 12 సంవత్సరాల ఉద్యోగ జీవిత కాలాన్ని వదిలి కేసీఆర్ సూచన మేరకు అధికార పార్టీ మద్దతుతో పట్టభవూదుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర గ్రూప్ వన్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రతి ఉద్యమంలో పాల్గ్గొన్నానని గుర్తు చేశారు. ఈరోజు శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక కావాలన్నారు. పట్టభవూధుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మేథావుల కోసం రూపకల్పన చేయబడ్డాయని, కాని ఈనాడు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేగా ఓడిన జీవన్‌డ్డి వంటి వారు పదవీ వ్యామోహంతో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారన్నారు. ఈనెల 22న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభవూదులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సమస్యలు పరిష్కారించే వారినే ఎన్నుకోవాలి
-మున్సిపల్ చైర్మన్ మల్లికార్డున్‌గౌడ్
సమస్యలు పరిష్కరించే వారినే ఎన్నుకోవాలని మున్సిపల్ చైర్మన్ మల్లికార్డున్‌గౌడ్ అన్నారు. పట్టభవూదుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్‌గౌడ్‌కు ఉద్యోగులు, పట్టభవూధులు సంపూర్ణ మద్దతివ్వాలని కోరారు. అంతకుముందు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీష్‌చంద్ర, పట్టభవూధుల అసోసియేషన్ జిల్లా కన్వీనర్ రాజేశ్, కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సీపతి రాజేశ్, టీఎంయూ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్‌డ్డి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరపవూతాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మన్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, మున్సిపల్ కౌన్సిలర్లు అరునార్తి వెంకటరమణ, సలాం, శ్రీనివాస్. గోదల జ్యోతి, సులోచనతో పాటు రిటైర్డు ఉధ్యోగులు, పట్టభవూదులు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్ష,కార్యదర్శులు గంగాధర్, గడ్డమీద కృష్ణాగౌడ్, నాయకులు లింగాడ్డి, జీవన్‌రావు, హమీద్, గోదల కృష్ణ పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...