మా నాన్న కోరిక నెరవేరింది


Tue,March 19, 2019 01:03 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ వల్లే చట్ట సభలకు వెళ్లాలన్న మా నాన్న శేరి విఠల్‌డ్డి కోరిక నెరవేరిందని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌డ్డి అన్నారు. సోమవారం మెదక్‌లో పార్టీ నాయకులు, అభిమానులు ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2001 నుంచి టీఆర్‌ఎస్‌లో వివిధ హోదాలలో పని చేశానన్నారు. 2002లో మంత్రి కరణం రామచందర్‌రావు మరణించిన సమయంలో మెదక్ ఉప ఎన్నిక జరిగిందని, ఆ ఎన్నికల్లో తాను టిక్కెట్ ఆశించినప్పటికీ సాధ్యం కాలేదన్నారు. అయినప్పటికీ ఉద్యమంలో పని చేసుకుంటూ సీఎం కేసీఆర్ వెన్నంటే ఉన్నానన్నారు. సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శిగా నియామకమైన తర్వాతా పూర్తిస్థాయిలో కేసీఆర్‌తోనే ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కష్టపడ్డదానికి ఫలితం దక్కిందని సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ తండ్రి శేరి విఠల్‌డ్డి మెదక్ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పని చేశారని, చట్ట సభలకు వెళ్లాలన్న కోరిక కాంగ్రెస్ మార్క్ రాజకీయం వల్ల సాధ్యం కాలేదన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా..
నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌డ్డితో కలిసి కృషి చేస్తానని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌డ్డి అన్నారు. ఎమ్మెల్సీ నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యేలకు ఏసీడీపీ నిధులు ఉన్నట్లే ఎమ్మెల్సీకి కూడా ఉంటాయని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌డ్డిని కూచన్‌పల్లి గ్రామస్తులతో పాటు మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు శాలువలు, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్షికమంలో పలు గ్రామాల సర్పంచులతో పాటు మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు, ఘణపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజేందర్‌డ్డి, కూచన్‌పల్లి సర్పంచ్ దేవాగౌడ్, మాజీ సర్పంచ్ శేరి మహేందర్‌డ్డి, బాలాగౌడ్, వెంకన్న, టీఆర్‌ఎస్ మండల మాజీ అధ్యక్షుడు కిష్టాగౌడ్ తదితరులు ఉన్నారు. వివిధ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ శేరి సుభాష్‌డ్డిని శాలువలు, పూలమాలలతో సన్మానించారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...