ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక


Tue,March 19, 2019 01:02 AM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ : నారాయణఖేడ్ పట్టణానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు అంబాదాస్ తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌లో చేరిన అంబాదాస్ సోమవారం ఎమ్మెల్యేను కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్‌డ్డి మాట్లాడుతూ అప్పటి పరిస్థితుల కారణంగా పార్టీకి దూరమైన అంబాదాస్ తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. పట్టణ అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతం కోసం క్రియాశీలకంగా పనిచేయాలని అంబాదాస్‌కు సూచించారు. అంబాదాస్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌డ్డి నాయకత్వంలోనే పని చేయాలని నిర్ణయించుకుని తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తూ పట్టణంలో టీఆర్‌ఎస్ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. కార్యక్షికమంలో మాజీ ఇన్‌చార్జి సర్పంచ్ ఎం.ఏ. నజీబ్, నాయకులు విజయ్‌బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...