పల్లెల అభివృద్ధికి సర్కార్ ప్రత్యేక కృషి


Tue,March 19, 2019 01:01 AM

-మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌డ్డి
-సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా చిట్కూలు మహిపాల్ రెడ్డి ఏకక్షిగీవం
మెదక్ మున్సిపాలిటీ : గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌డ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం మెదక్‌లోని సాయిబాలాజీ గార్డెన్స్‌లో జిల్లా సర్పంచుల ఫోరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్షికమానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌డ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఏకక్షిగీవంగా జిల్లా అధ్యక్షుడితో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని, అందులో భాగంగా మెదక్ జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచులే గ్రామాల్లో కీలక భూమిక పోషించాలని పంచాయతీరాజ్ నూతన చట్టంలో పొందుపర్చడం జరిగిందన్నారు. మూడు నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని గ్రామాల్లో సర్పంచులను ఏకక్షిగీవంగా ఎన్నుకోవడం జరిగిందని గుర్తుచేశారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని అప్పుడే సర్పంచులకు మంచి పేరు వస్తుందన్నారు. తాను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు మెదక్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.

సర్పంచుల సమస్యలను పరిష్కరిస్తా...
సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌డ్డి
జిల్లాలోని సర్పంచుల సమస్యలను పరిష్కరిస్తానని నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు చిట్కూలు మహిపాల్‌డ్డి అన్నారు. ఈ సందర్భంగా తనను సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా ఏకక్షిగీవంగా ఎన్నుకున్నందుకు జిల్లాలోని అన్ని మండలాల సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్పంచులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలకు అనేక నిధులను మంజూరు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మజీ మంత్రి హరీశ్‌రావు, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి మురళీయాదవ్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌డ్డి, మదన్‌డ్డి, రామలింగాడ్డి, క్రాంతికిరణ్, భూపాల్‌డ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన సర్పంచులు మహిపాల్‌డ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్షికమంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు భూమన్నయాదవ్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌డ్డితో పాటు జిల్లాలోని అయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...