రూ.6లక్షల ఎల్వోసీల అందజేత


Sun,March 17, 2019 11:23 PM

మెదక్ అర్బన్/ రామాయంపేట: ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఐదు మంది లబ్ధిదారులకు రూ.6 లక్షలు ఎల్వోసీలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నివాస గృహంలో బాధిత కుటుంబాలకు అందించారు. మెదక్ పట్టణానికి చెందిన మహ్మద్ సయ్యోద్దీన్ గుండె వ్యాధితో బాధపడుతున్న వారికి రూ.లక్ష, మెదక్ పట్టణానికి చెందిన లింగ బచ్చయ్య అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో జాయిన్ కావడంతో రూ.2 లక్షల ఎల్వోసీని అందజేశారు. రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్ గ్రామానికి చెందిన ముత్తిరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మల్లారెడ్డి దవాఖానలో చికిత్స తీసుకుంటున్న ఆయనకు ఎల్వోసీ ద్వారా రూ.లక్ష, రామాయంపేట మండలం ధామరచెరవు గ్రామానికి చెందిన దేవుజ కిడ్నీ సంబంధిత వ్యాధితో నిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్న ఆయనకు రూ.లక్ష, పాపన్నపేట మండలానికి చెందిన కె.మోహన్‌ను పిచ్చికుక్క కరవడంతో పరిస్థితి విషమించడంతో ఉస్మానియా దవాఖానలో చికిత్స తీసుకుంటున్న ఆయనకు వైద్య ఖర్చుల కోసం రూ. లక్ష చొప్పున ఎల్వోసీలు అందజేశారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...