మల్కాపూర్ తరహాలోనే పర్వతాపూర్


Sun,March 17, 2019 11:23 PM

తూప్రాన్ రూరల్: రాష్ట్రంలో ఆదర్శ గ్రామమైన మల్కాపూర్ తరహాలోనే తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని రామాయంపేట మండలం పర్వతాపూర్ సర్పంచ్ లక్ష్మీస్వామి, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ యువకులు అన్నారు. మల్కాపూర్‌లో ఆదివారం వారు పర్యటించారు. గ్రామంలో జరిగిన వివిధ అభివృద్ధి పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి ఇక్కడ జరిగిన గ్రామాభివృద్ధిని పరిశీలన చేశారు. హరితహారం పథకం కింద రోడ్డుకు ఇరువైపుల నాటిన మొక్కలు, తడిపొడి చెత్తను వేరు చేసేందుకు నిర్మించుకున్న డంపింగ్ యార్డు, గ్రామ ప్రధాన కూడలిలో గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న రాక్‌గార్డెన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా పర్వతాపూర్ సర్పంచ్ లక్ష్మీస్వామి, యువకులు మాట్లాడుతూ.. మల్కాపూర్ తరహాలోనే తమ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పర్వతాపూర్ పాలకవర్గం సభ్యులు, యువకులతో పాటు మల్కాపూర్ సర్పంచ్ మన్నె మహాదేవినవీన్, ఉపసర్పంచ్ పల్లెపాటి సుగుణశేఖర్, మేక్‌ఇన్ మల్కాపూర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...