14లక్షల మొక్కల పెంపకమే లక్ష్యం


Sun,March 17, 2019 11:23 PM

తూప్రాన్ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. హరిత తెలంగాణ సాధించాలన్న లక్ష్యంతో ఈ మొక్కల పెంపకాన్ని చేపట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేసి కార్యచరణతో ముందుకు సాగుతున్నారు. ప్రతి గ్రామంలో లక్ష మొక్కలు పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉండగా దీనికి అనుగుణంగా ఆయా గ్రామాల్లో ఈజీఎస్ సిబ్బంది నర్సరీలను ఏర్పాటు చేశారు. తూ ప్రాన్ మున్సిపాలిటీని మినహాయించి మండలంలో ని 14 గ్రామ పంచాయతీల్లో జూన్ మాసం నాటికి 14లక్షల మొక్కలు పెంచాలన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భా గంగానే మల్కాపూర్, కోనాయిపల్లి(పీబీ), గుండ్రెడ్డిపల్లి, దాతర్‌పల్లి, ఇస్లాంపూర్, వెంకటరత్నాపూర్, యావాపూర్, ఘనపూర్, వెంకటాయపల్లి, కిష్టాపూ ర్, నర్సంపల్లి, నాగులపల్లి, ఇమాంపూర్, వట్టూర్ తదితర గ్రామాల్లో ఈజీఎస్ ద్వారా నర్సరీలను ఏ ర్పాటు చేసి మొక్కలను పెంచేందుకు సిద్ధం చేశారు. వివిధ రకాల పండ్లు, పూల మొక్కలు, టేకు, మలబార్,చింత,ఈత,నిమ్మ, దానిమ్మ, మామిడీ ఉసిరి, ఎలిగె,ఇప్ప,అల్లనేరడు,కరివేపాకు, గోరింటాకులతో పాటు 15 రకాల మొక్కలను సిద్ధం చేసి ఇం దుకు అనుగుణంగా నర్సరీల పెం పకానికి అవసరమైన ఎర్రమట్టి, నల్లమట్టిని సేకరించి శుద్ధి చేస్తున్నారు.

మట్టిలో పేరుకుపోయిన రాళ్లు, చెత్తాచెదారాన్ని తొలిగిస్తున్నారు. వీటితో పాటే సేంద్రియ ఎరువులను, ఇతర మిశ్రమాలను కలిపి పాలిథిన్ కవర్‌లలో నింపుతున్నారు. అయితే మట్టితో నింపిన కవర్‌లలో పలు రకాల మొక్కల విత్తనాలను కలిపి వాటి ఎదుగుదలకు కావాల్సిన మిశ్రమాలను జత చేస్తున్నారు. ఈ మేరకు తూప్రాన్ మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో నర్సరీల పెంపకం ప్రక్రి య వేగవంతంగా కొనసాగుతుంది. రానున్న జూన్ నాటికి నర్సరీల్లో సిద్ధం చేసిన మొక్కలను వర్షాలు కురియగానే గ్రామస్తులకు పంపిణీ చేసి నాటించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయి తే ప్రతి నర్సరీలో లక్ష మొక్కల పెంపకానికి సుమా రు రూ. 8లక్షలు ఖర్చు చేస్తుండగా ఈజీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి లభిస్తుంది. గ్రా మీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధిని కల్పించడం, మరోవైపు పచ్చని వాతావరణంతో గ్రామాలు కళకళలాడలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా కన్పిస్తుంది.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...