కిడ్నీ రోగులుకు సాంత్వన


Sun,March 17, 2019 02:08 AM

-జిల్లా కేంద్ర దవాఖానలో యూనిట్
-ఏడాదిలో 2613 మందికి చికిత్సలు
-ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు
-ఆనందం వ్యక్తం చేస్తున్న కిడ్నీ రోగులు
మెదక్ మున్సిపాలిటీ : జిల్లా కేంద్ర దవాఖానలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం కిడ్నీ రోగులకు వరంగా మారింది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలు అంతా ఇంతా కాదు. వ్యాధి తీవ్రతను బట్టి వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. అది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ప్రైవేట్ దవాఖానల్లో బిల్లు దవాఖాన బిల్లు ఎక్కువ కావాల్సిందే. వారి ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా డయాలసిస్ సేవలను అందిస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం దవాఖానాల్లో డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అండర్ పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు రూ. ఒక కోటీ వ్యయంతో ప్రభుత్వం కిడ్నీ ఫెయిల్ అయిన పేదలు డయాలసిస్ చేయించుకునేలా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంతో సౌకర్యం కల్పించింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కిడ్నీ రోగులకు డిస్పోజబుల్ డైమెజిర్ ట్యాబింగ్ విధానంతో ఇక్కడ డయాలసిస్ చేస్తున్నారు. దీంతో రోగులు కూడా ఎక్కువగా వస్తున్నారు.

చికిత్స విధానం...
కిడ్నీ సమస్యలకు నేడు అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వైద్యం అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా కిడ్నీలు పాడుకాకముందే సమస్యలను ప్రాథమిక నిర్ధారణతో గుర్తించి మందులతో సమస్యలను అధిగమించవచ్చు. పరిస్థితి చేయి దాటితే డయాలసిస్‌తో వైద్యం అందించవచ్చు. డయాలసిస్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో పెరిటోనియల్ డయాలసిస్‌తో కిడ్నీ పాడైన వ్యక్తి బొడ్డు నుంచి ట్యూబ్ వేసి డయాలసిస్ ఫ్లూయిడ్లతో చికిత్స అందిస్తారు. వారంలో రెండు మూడు సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంటి దగ్గర రోగి చేసుకోవచ్చు. రెండో రకం హీమె డయాలసిస్ వైద్యుల పర్యవేక్షణలో రక్తనాళాలతో మిషన్ ఉపయోగించి రక్తాన్ని శుద్ధి చేస్తారు. ఈ చికిత్స ఖర్చుతో కూడుకున్నది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంద మందిలో నలభై మంది పలు రకాల కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం జీర్ణవ్యవస్థలో జీర్ణం అయిన తర్వాత మిగిలిన పదార్థాలు రక్తంలోకి కలిసి మూత్రనాళాల్లోకి ప్రవేశిస్తాయి. మూత్రపిండాలతో రక్తం, రక్తంలోని పదార్థాలు పలు దఫాలుగా శుద్ధి చేయబడి అవసరమైన సోడియం, క్యాల్షియం, పోటాషియం, పాస్ఫెట్ లవణ పోషకాలకు శరీరానికి అందిస్తాయి. అంతేకాకుండా శుద్ధి చేయగా మిగిలిన వ్యర్థాలను బయటకు పంపుతాయి. వీపు భాగంలో వెన్నెముకకు ఇరువైపులా చిక్కుడు గింజ ఆకారంలో కిడ్నీలు ఉంటాయి. పిల్లల్లో సాధారణంగా నాలుగు సెంటిమీటర్లు, పెద్దలలో 9-12 సెంటిమీటర్ల వరకు ఉంటాయి. ఒక్కో కిడ్నీ బరువు 150 గ్రాముల వరకు ఉంటుంది.

వారానికి రెండు, మూడు సార్లు...
కిడ్నీ ఫెయిల్ అయిన రోగులను నెఫ్రాలజీ వైద్యులు డయాలసిస్‌కు రెఫర్ చేస్తారు. ఆ రోగులకు ఇక్కడ డయాలసిస్‌ను అందిస్తున్నారు. డయాలసిస్ కావాల్సిన వారి వివరాలను ఆరోగ్యశ్రీలో నమోదు చేయించి, అనుమతి వచ్చిన తర్వాత డయాలసిస్ చేస్తున్నారు. రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా కేంద్ర దవాఖానలో 2018, ఫిబ్రవరి 7వ తేదీన డయాలసిస్ కేంద్రాన్ని అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు ప్రారంభించారు. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన రోగులకు జీవితకాలం మొత్తం ఇక్కడ ఉచితంగా డయాలసిస్ చేయనున్నారు. అంతేకాదు రోగులకు ఉచితంగా రక్తం రావడానికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు కూడా ఇక్కడే అందజేస్తున్నారు. ప్రతీ సారి ఇంటికి వెళ్లడానికి అవసరమైన రవాణా చార్జీలు కూడా ఇస్తున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు.
గతంలో కిడ్నీ రోగులు డయాలసిస్ చేయించుకోవాలంటే హైదరాబాద్‌లోని నీమ్స్, కీమ్స్, నారాయణ హృదయాల దవాఖానలతో పాటు సంగారెడ్డిలో ఉన్న డయాలసిస్ కేంద్రాలకు వెళ్లేవారు. ఇప్పుడు జిల్లా కేంద్ర దవాఖానకు జిల్లాలోని ఆయా మండలాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా వస్తున్నారు.
ఇక నుంచి పట్టణాలకు వెళ్లి ప్రైవేట్ దవాఖానల్లో డయాలసిస్ కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా డయాలసిస్ సేవలను అందిస్తున్నది. దీని వల్ల చాలా మంది రోగులు ఇక్కడే చికిత్స చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. డయాలసిస్ కోసం దూరం వెళ్లకుండా సమీపంలోనే చేయించుకునే మంచి అవకాశం లభించింది. దీంతో రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...