భారీ మెజార్టీయే టీఆర్‌ఎస్ లక్ష్యం


Sun,March 17, 2019 01:56 AM

-ఎంపీ ఎన్నికల మండల సన్నాహక సమీక్ష సమావేశంలో
-పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ భూపతిరెడ్డి
తూప్రాన్, నమస్తేతెలంగాణ: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి మెజార్టీ రికార్డు సృష్టించాలని రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు నేడు దేశ, విదేశాలను ఆకట్టుకుంటున్నాయని గుర్తు చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎటువంటి ఫలితాలు అందించారో ఆ రికార్డులను అధిగమించేలా ఎంపీ ఎన్నికల్లో గ్రామాల వారీగా మెజార్టీలు సాధించి ఇవ్వాలన్నారు. 17 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఢిల్లీలో టీఆర్‌ఎస్ సత్తాను మరోసారి చూపాలన్నారు. మనోహరాబాద్ మండల టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలోనే మెదక్ అభ్యర్థి మెజార్టీ గత రికార్డులను బద్దలు కొట్టాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నేటి తెలంగాణ రానున్న కాలంలో బంగారు తెలంగాణగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని చెప్పారు.

దేశంలోనే నేడు మెదక్ జిల్లాతో పాటు ముఖ్యమంత్రి సారథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవరాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే 6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని రానున్న 5 సంవత్సరాల్లో మరో 5 వేల కోట్లు ఖర్చు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని వెల్లడించినట్లు వివరించారు. దేశానికే తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దిక్సూచిగా మారాయన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందంటే కేసీఆర్ ఆలోచన విధానం, సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం కేసీఆర్ అమలు చేసిన పథకాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ర్టాల ప్రభుత్వం అమలు చేసేందుకు పోటీ పడుతున్నాయని ఇప్పటికే చాలా రాష్ర్టాల ప్రభుత్వాలు కొన్ని పథకాలను కాపీ కొట్టి అమలు చేస్తున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరంగా సరఫరా చేస్తున్న ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు.

దేశంలోనే మొట్ట మొదటి సారిగా పెట్టుబడి సహాయం అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వ పథకం అమలు తీరును చూసిన కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పథకాన్ని అమలు చేయడం తెలంగాణకు గర్వ కారణమన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాపరెడ్డి, యాదవరెడ్డిలతో పాటు మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పెంటాగౌడ్, సర్పంచ్‌లు నాగభూషనం, బుల్లెట్ రాజులతో పాటు నాయకులు చెంద్ర శేఖర్, పురం రవీందర్, బాలకృష్ణారెడ్డి, నాగిరెడ్డి, వెంకట్‌గౌడ్, తప్పెట శ్రీనివాస్, రమేశ్‌గౌడ్, నరేందర్, భిక్షపతి, జావెద్, శ్రీహరిగౌడ్, నరాల పెంటయ్య, కొండాపూర్ నర్సింగ్‌రావులతో పాటు పాల్గొన్నారు. అనంతరం మండల సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధిక సాధించడంతో పాటు మెజార్టీ గెలుపు కోసం అవసరమైన ప్రణాళికను ఈ కమిటీ సభ్యులు సిద్ధం చేయాల్సి ఉందన్నారు.

170
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...