సదరం క్యాంపునకు విశేష స్పందన


Sun,March 17, 2019 01:55 AM

మెదక్ మున్సిపాలిటీ : మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సదరం క్యాంపునకు విశేష స్పందన లభించింది. శనివారం కొల్చారం, శివ్వంపేట, పాపన్నపేట మండలాలకు చెందిన వికలాంగులు, అంధులు, చెవిటి, మూగ వారు భారీ ఎత్తున తరలివచ్చారు. సదరం క్యాంపునకు తరలివచ్చిన వారికోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి సదరం క్యాంపును సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదరం క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ క్యాంపులో మొత్తం 695 మంది పాల్గొనగా అందులో శారీరక వికలాంగులు 420 మంది, అంధులు 137, మూగ, చెవుడు 138 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సీతారామారావు, డాక్టర్లు, ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...