అర్బన్ పార్కు పనులు పరిశీలన


Sun,March 17, 2019 01:54 AM

నర్సాపూర్,నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం అడువుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా నర్సాపూర్ ఫారెస్ట్‌లో రూ.20కోట్లతో అర్బన్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ పీసీసీఎఫ్ దోబ్రియాల్ అన్నారు. శనివారం నర్సాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతాన్ని అడిషనల్ పీసీసీఎఫ్ దోబ్రియాల్, డీఫ్‌వో పద్మజారాణి, నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గణేశ్ తదితరులు పరిశీలించారు. పార్కు పనులు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మెడన్‌బండ వద్ద వాచ్‌టర్ పనులతో పాటు సోలార్ ప్లాంటు, చెక్‌డ్యామ్ పనులతో పాటు ప్రహరీ నిర్మాణా పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నర్సాపూర్ అడవి హైదరాబాద్ నగరానికి అతి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ అర్బన్ పార్కు ఏర్పాటు చేస్తే పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని భావించి అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అర్బన్ పార్కును రూ.20 కోట్లతో 750 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నాట్లు తెలిపారు. ఉన్న అడవుల రక్షణకు 7 కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ బాలేశ్‌తో పాటు అటవీశాఖ సిబ్బంది ఉన్నారు

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...