ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయం


Sun,March 17, 2019 01:54 AM

మెదక్, నమస్తే తెలంగాణ :సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై పలు పార్టీల వారు టీఆర్‌ఎస్‌లో చేరుత్నున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ కార్యాలయంలో పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి సాధ్యమని ప్రత్యేక తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మడమ తిప్పకుండా ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అన్నారు. అదే పట్టుదలతో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు నదులపై కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారన్నారు. పాలనా సొలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయన్నారు.

సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉండటంతోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌నే ఆదరించారని, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్ విజయభేరి మోగిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పోటీ చేస్తున్న 16 ఎంపీ స్థానాలతో పాటు మిత్రపక్షమైన ఎంఐఎం 1 స్థానంతో మొత్తం 17 ఎంపీ స్థానాలను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో మార్గం ఆంజనేయులు, రాములు, సిద్ధ్దిరాములు, లక్ష్మీనారాయణలతో పాటు పలువురు ఉన్నారు. కార్యక్రమంలో మెదక్ జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, టీఆర్‌ఎస్ మెదక్, హవేళిఘనపూర్ మండలాల అధ్యక్షులు అంజాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మాణిక్‌రెడ్డి, కిష్టయ్య, ఎలక్షన్‌రెడ్డి, రాములు, జయరాంరెడ్డి, జహంగీర్, మల్లేశం, శ్రీనివాస్‌గౌడ్, యాదగిరి, మార్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...