ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్ రథాలు సిద్ధం


Sun,March 17, 2019 01:53 AM

తూప్రాన్, నమస్తేతెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. ఆ దిశగా సన్నాహాలు పూర్తి చేశారు. అందుకు అవసరమైన ప్రచార సన్నాహాల్లో భాగంగా ప్రచార రథాలను సిద్ధం చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ప్రచారం నిర్వహించేందుకు రెండు వాహనాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వాటికి సౌండ్ సిస్టం పనులు కూడా నేడో రేపో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతుండడంతో ప్రచార వాహనాలకు ప్రాధాన్యత పెరిగింది. అందుకు వాహనాలను సిద్ధం చేయడంతో పాటు వాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోతో పాటు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిల ఫొటోలతో కూడిన ప్రచార కటౌట్‌లు ఏర్పాటు చేశారు. వీటిని మనోహారాబాద్‌లో సిద్ధంగా ఉంచారు. పార్టీ ఆదేశించిన వెంటనే ప్రచారం మొదలు పెట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...