ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలి


Sun,March 17, 2019 01:52 AM

తూప్రాన్ రూరల్ : తక్కువ నీటితో అధిక దిగుబడి, ఎక్కువ ప్రయోజనాలు పొందగలిగే ఉద్యానవన పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెమికల్చర్ ఆఫీసర్ (డీహెచ్‌ఎస్‌వో) నర్సయ్య రైతులకు సూచించారు. తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో శుక్రవారం రాత్రి ఉద్యానవన పంటల సాగు, మైక్రో ఇరిగేషన్, నీటి యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం తదితర అంశాలపై దృశ్య శ్రవణ పద్ధతుల (పవర్ పాయింట్ ప్రజంటేషన్)ద్వారా గ్రామ రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యానవన పంటల సాగు విధానం, వాటికి అందించాల్సిన ఎరువుల వాడకం, డ్రిప్ పరికరాలతో రైతులకు కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై రైతులకు అర్ధమయ్యే తరహాలో వివరించారు. ఈ సందర్భంగా డీహెచ్‌ఎస్‌వో నర్సయ్య మాట్లాడుతూ.. సాగునీటి బోర్లలో నీటి వనరులకు అనుగుణంగా పంటలు సాగు చేసుకునేందుకు గానూ ఉద్యానవన పంటలు రైతులకు ఎంతో మేలు చేకూరుస్తాయన్నారు. వేసవి కాలంలో ఉద్యానవన పంటలపై రైతులందరూ దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పరంగా రైతులకు కావాల్సిన ఎరువులు, డ్రిప్ పరికాలతో పాటు ఇతర సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ఏరియా అధికారి ఏఎస్ సుబ్బారావు, ఇండోపిల్ పరిశ్రమ ఏరియా అధికారి నాగలింగం, సర్పంచ్ మన్నెమహదేవి, రైతులు పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...