స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా పనిచేయాలి


Sun,March 17, 2019 01:50 AM

-కౌడిపల్లిలో డంపింగ్‌యార్డు, వైకుంఠదామాల స్థలాల ఎంపిక
-జిల్లా పంచాయితీ అధికారి హనోక్ వెల్లడి
కౌడిపల్లి: స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని జిల్లా పంచాయతీ అధికారి హనోక్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన కౌడిపల్లిలోని బతుకమ్మతండాకు వెళ్లేదారిలో ప్రభుత్వ భూమిని అధికారులు పరిశీలించారు. కౌడిపల్లి పట్టణానికి డంపింగ్‌యార్డుతో పాటు వైకుంఠదామాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్ధేశ్యంతో స్థలాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డీపీవో హనోక్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని 469 గ్రామపంచాయతీల్లో డంపింగ్‌యార్డులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. డంపింగ్‌యార్డు నిర్మాణంతో గ్రామంలోని తడి, పొడి చెత్తను సేకరించి ప్లాస్టిక్‌ను వంద శాతం బహిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. అలాగే పారిశుధ్య నిర్మూలనలో భాగంగా ఆయా గ్రామాల సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అలాగే వంద శాతం ఇంటిపన్నును వసూల్ చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కోటిలింగం, స్థానిక సర్పంచ్ చిలుముల వెంకటేశ్వరరెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిలుముల నర్సింహారెడ్డి,ఉప్ప సర్పంచ్ చంద్రం శ్రీనివాస్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి శిరీష, వార్డు సభ్యులు తిరుమల్లేశ్, పెంటాగౌడ్, మల్లేశం, రిటైర్డ్ ఎస్‌ఐ షెట్టయ్య పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...