పదికి రెడీ


Thu,March 14, 2019 11:38 PM

-రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం
-ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ
-జిల్లాలో 67 పరీక్షా కేంద్రాలు
-5 పరీక్షా కేంద్రాల్లో పూర్తి స్థాయి సీసీ కెమెరాలు
-జిల్లా వ్యాప్తంగా పరీక్ష రాయనున్న 11,633 మంది విద్యార్థులు
-11,361 రెగ్యులర్ విద్యార్థులు, 272 ప్రైవేట్ విద్యార్థులు
-పరీక్షా కేంద్రాలలోకి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు
-5 నిమిషాల వరకు అనుమతి
-పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
మెదక్, నమస్తే తెలంగాణ :మార్చి 16 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించ వద్దని బావించినా ఆ నిబంధనను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ గత సంవత్సరం నుంచి తెరదించారు. నిర్ణీత సమయానికి 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోని అనుమతిస్తారు. కానీ విద్యార్థులు మాత్రం పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాల్లో కేవలం 5 పరీక్షా కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ్ మాడల్ పాఠశాల - ఏ, బీ పరీక్షా కేంద్రాలు, గీతా పాఠశాల, తూఫ్రాన్‌లోని గీతా పాఠశాల, రేగోడ్ మాడల్ స్కూల్ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 11,633 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 5,677 మంది విద్యార్థులు, 5,684 విద్యార్థినులు ఉన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 272 మంది రాయనున్నారు. జిల్లాలోని 67 పరీక్షా కేంద్రాలకు 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్టుమెంట్ అధికారులు, 30 మంది కస్టోడియన్లు, సుమారు 700 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మూడు ప్లయింగ్ స్కాడ్ బృందాలు, 21 సిటింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు.

సివిల్ డ్రెస్‌లో రావాలి..
విద్యార్థులు స్కూల్ యూనిఫాంలో కాకుండా సివిల్ డ్రెస్‌లో పరీక్షలకు హాజరు కావాలని అధికారులు పేర్కొంటున్నారు. యూనిఫాంలో ఉంటే ఫలానా పాఠశాల అని గుర్తించే అవకాశం ఉంటుందని, దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున విద్యార్థులు సివిల్ డ్రెస్‌లో రావాలని సూచిస్తున్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పరీక్షలు జరిగేంత వరకు 144 సెక్షన్ విధిస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్, స్టేషనరీ దుకాణాలను మూసివేయనున్నారు.

పోలీసు స్టేషన్‌లలో ప్రశ్నపత్రాలు...
పదోతరగతి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలీసు స్టేషన్లకు చేరాయి. ఏ రోజుకారోజు ప్రశ్నపత్రాలను ఉదయం పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడం జరుగుతుంది.

వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నహాల్‌టికెట్లకు అనుమతి...
విద్యార్థులు www.bseteleangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లను పరీక్షకు అనుమతించాలని పదో తరగతి పరీక్షల నిర్వహణ రాష్ట్ర అధికారులు సూచించారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...