పీఎం కిసాన్ సమ్మాన్ అందరికీ వర్తింపచేయాలి


Tue,February 19, 2019 11:34 PM

సంగాడ్డి టౌన్ : కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పీఎం స మ్మాన్ పథకం అందరికీ వర్తింపజేయాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాగుల సారయ్య అన్నారు. మంగళవారం జెడ్పీ 3వ, 5వ, 6వ స్థాయీ సంఘ సమావేశాలు రాగుల సా రయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం సమ్మాన్ పథకం తో రైతులకు పెట్టుబడి సాయం అందే లా చూడాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతులందరి నుంచి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. రైతుల వివరాలు సేకరణ పూర్తయ్యిందని, మొదటి విడుత డబ్బులు ఈనెల 24వ తేదీ నుంచి అందజేయనున్నామని వివరించారు. లీస్టులో పేర్లు లేని రైతులు తమ పాసుబుక్ జిరాక్స్ , వారి ఆధార్‌కార్డు జిరాక్స్ ఇస్తే ఈనెల 2వ తేదీ నుంచి వివరాలను ఆన్‌లైన్‌లో అఫ్‌లోడ్ చేస్తామన్నారు. పశుసంవర్థక శాఖపై సమీక్షిస్తూ జిల్లాలో మొదటి విడుత గొర్రెల పంపిణీ పూర్తయ్యి రెండో విడుత పంపిణీ ప్రారంభంమైందన్నారు. జీవాలకు మేత కోసం ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గడ్డి విత్తనాలను సబ్సిడీపై అందిస్తున్నామని పశుసంవర్థక శాఖ అధికారులు తెలిపారు.

వైస్ చైర్మన్ సారయ్య మాట్లాడుతూ గ్రామాల్లో గొర్రెలు, మేకలను కుక్కలు కరిచి చంపుతున్నాయని, ఆ విధంగా కాకుండా వాటికి షెడ్లు నిర్మించుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమ ప్రభుత్వమని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కృషి చేయాలన్నారు. జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అమీనొద్దీన్ మాట్లాడుతూ కొండాపూర్ మండలంలో పాలశీతలీకరణ కేంద్రం మంజూరు చేసి నిర్మించిన ఇంతవరకు ప్రారంభించలేదని ఎప్పుడు ప్రారంభిస్తారని అధికారులను ప్రశ్నించారు. మరో వారంలో రోజుల్లో ప్రారంభించి పాడి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. మత్య్సశాఖపై సమీక్షిస్తూ సింగూరు ప్రాజెక్టులో ప్రభుత్వం నుంచి నీలకంఠ రొయ్యలను 29లక్షలు వదిలామని అధికారులు తెలిపారు. అదే విధంగా జిల్లాలో 500 మంది మత్స్యకారులకు లైసెన్స్‌లు రెన్యువల్ చేయడం జరిగిందని, అదే విధంగా చేపలు విక్రయించుకునేందుకు సబ్సిడీపై వాహనాలను అందించామని వివరించారు.

సివిల్ సప్లైపై సమీక్షిస్తూ నూతనంగా రేషన్‌కార్డులలో కొత్త పేర్లు చేర్చడం, చనిపోయిన వారి పేర్లు తొలిగిస్తున్నామని ఆ శాఖ అధికారులు తెలిపారు. అదే విధంగా ఉజ్వల గ్యాస్ పథకంతో నిరుపేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని వివరించారు. జిల్లాలో బయోమెవూటిక్ తో సరుకులు పంపిణీ చేస్తున్నామని ఎక్కడా కూడా దుర్వినియోగం కావడం లేదన్నారు. దీనికి సభ్యులు వీఆర్‌వోలకు బయోమెవూటిక్ రాని వారివి వేసి సరుకులు ఇవ్వాలని అప్పజెప్పారని, రేషన్ డీలర్లు, వీఆర్‌వోలు కలిసి సరుకులను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనికి స్పందించిన అధికారులు త్వరలో జిల్లాలో ఐరీస్ వస్తుందని, అప్పుడు ఎలాంటి తప్పులు లేకు ండా అందరికి సరుకులు అందుతాయన్నారు. అనంతరం సంక్షేమం, ఐసీడీఎస్‌పై సమీక్షించా రు. ఈ సమావేశాల్లో అకౌంట్స్ అధికారి ఎ సుదీర్, కో ఆప్సన్ సభ్యులు అమీనొద్దీన్, యస్.డి. మొయిజొద్దీన్, జడ్పీటీసీలు శ్రీనివాస్‌డ్డి, మంగేశ్వరి, గుండు స్వప్న, కర్ణ శోభారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

154
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...