ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు


Mon,February 18, 2019 11:57 PM

చిలిపిచెడ్ : ఎస్టీ, ఎస్సీ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం చిట్కుల్ రోడ్డు నుంచి బద్రియ తండా, గూజిరి తండా, గౌతాపూర్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణానికి, ఎస్సీ కమ్యూనిటీహాల్‌కు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్టీ, ఎస్సీలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ఎస్టీలకు నూతన గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశారన్నారు. ఎస్టీలకు సరైన రవాణా లేకపోవడంతో వారి కోసం రూ.1.98 కోట్లతో చిట్కుల్ నుంచి గౌతాపూర్ రోడ్డు వరకు మూడు కిలో మీటర్ల వరకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. అలాగే ఎస్సీ కమ్యూనిటీహాల్‌కు రూ.5లక్షలు మంజూరు కావడంతో ఎస్సీలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ హంసీబాయి, ఉమ్మడి మండల జడ్పీటీసీ యాదమ్మరామాగౌడ్, వైస్ ఎంపీపీ సున్నం సతీష్, నర్సాపూర్ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా రైతు సమన్వయ సభ్యులు సయ్యాద్ హుస్సేన్, శివాంజనేయులు, మండల రైతు సమన్వయ కర్త రాజిరెడ్డి, మాజీ సర్పంచులు ఫోరం మండల అధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, ఆయా గ్రామ సర్పంచులు బుజిబాయి, గోపాల్‌రెడ్డి, పరశురాంరెడ్డి, భిక్షపతి, లక్ష్మీదుర్గారెడ్డి, రాకేశ్‌నాయక్ నాయకులు విశ్వంభరస్వామి, మాణిక్యరెడ్డి, షేఫి, ధర్మారెడ్డి, పాపయ్య, రాజు పాల్గొన్నారు.

165
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...