కనుల పండుగగా బీరప్ప జాతర


Mon,February 18, 2019 11:56 PM

చిలిపిచెడ్ : తెలంగాణ సంప్రదాయాలతో గొల్లకురుమలు బీరప్ప జాతర మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. సోమవారం మండలంలోని చిట్కుల్ గ్రామంలో ఉన్న దేవతలకు పూజలు చేసి, బోనాలు తీశారు. ఉదయం నుంచి గ్రామస్తులు గ్రామ దేవతలకు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గొల్లకురుమలు వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరారు. గ్రామం సంతోషంగా ఉండాలని, బంగారు పంటలు పండాలని గ్రామ దేవతలకు మొక్కుకున్నారు. ఆలయంలో స్వామి వారికి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. బీరప్ప స్వామి ఆలయంలో పోతరాజుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. జాతరకు గ్రామంతో పాటు పక్క గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా రెడ్డి ముఖ్యఅతిథులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిట్కుల్ గ్రామ సర్పంచ్ గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ శేఖమ్మనారాగౌడ్, ఉప సర్పంచ్ సుధాకర్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ హంసీబాయి, ఉమ్మడి మండల జడ్పీటీసీ యాదమ్మరామాగౌడ్, వైస్ ఎంపీపీ సున్నం సతీశ్, గొల్లకురుమ సంఘం సభ్యులు పోచయ్య, భిక్షపతి, బాలయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.అమ్మవారికి ఎమ్మెల్యే పూజలుమండల పరిధిలోని చిట్కుల్ గ్రామ శివారులో మంజీరా నది తీరన వెలసిన చాముండేశ్వరీ అమ్మవారికి నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

187
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...