గురుకులాలతో కార్పొరేట్ విద్య


Mon,February 18, 2019 11:55 PM

పెద్దశంకరంపేట : పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టిందని, విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చీలపల్లి గ్రామంలో సీడీవో నిధులతో రూ.5లక్షలతో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖేడ్ నియోజకవర్గంలో 7 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమంలో బోధించేలా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం దేశచరిత్రలో ఇప్పటివరకు ఏరాష్ట్రం చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యనందిస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ నిరంతర కృషి చేస్తున్నారన్నారు. 60 సంవత్సరాల ఉమ్మడి పాలనలో ఖేడ్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ఆగిపోయిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విజయరామరాజు, మండల రైతు సమితి అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, సర్పంచ్ ప్రకాశ్, పేట మాజీ సర్పంచ్ జంగం శ్రీనివాస్, నాయకులు పద్మారావు, భూంరెడ్డి, సాయిరెడ్డి, పున్నయ్య, శంకరయ్య, శ్రీనివాస్, హెచ్‌ఎంలు వెంకటేశం, రామచంద్రాచారి, తదితరులు పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...