టార్గెట్‌ను పూర్తి చేయండి


Sun,February 17, 2019 12:43 AM

-19, 20, 21 తేదీల్లో ఎన్‌డీడీ, ఎండీఏ కార్యక్రమం
-వైద్యాధికారులకు, సూపర్‌వైజర్లకు శిక్షణ
-డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్‌రావు
మెదక్ మున్సిపాలిటీ : జిల్లాలోని లక్ష్యానికి మించి టార్గెట్‌ను పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్యాధికారులు, సూపర్‌వైజర్లకు ఎన్‌డీడీ (జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం), ఎండీఏ(మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) మాత్రల గురించి శిక్షణను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 7,78,633 జనాభా ఉందని అందులో 8,56,040 మందికి ఆల్బెండజోల్ మాత్రలు, 20,10,063 డీఈసీ మాత్రలు వేయాలని అన్నారు. ఈ నెల 19, 20, 21వ తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 1066 పాఠశాలలు, 1076 అంగన్‌వాడీ కేంద్రాలు, 50 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. దీనిలో 2,18,406 మంది పిల్లలకు ఈ మాత్రలు వేయడం జరుగుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లే పిల్లలు 42,491 మంది ఉన్నారని, 895 మంది వెళ్లని పిల్లలు ఉన్నారన్నారు. బడికి వెళ్లే పిల్లలు 1,07,780, బడికి వెళ్లని పిల్లలు 2270, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే పిల్లలు 48,944, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు 6406, ప్రైవేట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు 9190 మంది ఉన్నారన్నారు. అయితే 1-2 సంవత్సరాలలోపు పిల్లలకు సగం మాత్ర, 2 సంవత్సరాల పై బడిన వారందరికీ 1 మాత్ర చొప్పున వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఫైలేరియా వ్యాధి బారిన పడిన వారు 2297 మంది ఉన్నారని, వీరికి తగిన చికిత్స అందించడం జరుగుతుందన్నారు. డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలను ఏడాదికి ఒకసారి చొప్పున 5-6 ఏండ్ల పాటు తీసుకుంటే సంక్రమిత వ్యక్తుల్లో ఉన్న సూక్ష్మ ఫైలేరియా నశిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో 3115 మంది వలంటీర్లు, 312 మంది సూపర్‌వైజర్లు, 20 మంది రాపిడ్ రెస్పాస్ టీం పాల్గొంటాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ సంతోష్ కుమార్, మలేరియా, ఫైలేరియా డాక్టర్ సుమిత్ర, రాజు, కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ నవీన్ కుమార్, ఆర్‌బీఎస్‌కే పీవో ఇర్షాద్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు అనిత, విజయనిర్మల, ఎఎంవో కుమారస్వామి, పాండు రంగాచారి, జిల్లాలోని వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...