పెట్టుబడి సాయంతో రైతుకు రుణ విముక్తి..!


Tue,February 12, 2019 12:57 AM

-మండలంలో 10,196 మంది రైతులు
-రైతుబంధుకు 9,514 మంది దరఖాస్తు
-మండలానికి రూ.7,96,66,670 పెట్టుబడి సాయం
-8,716మందికి రూ.7,46,90,420 బ్యాంకు ఖాతాలో జమ
-పెట్టుబడి సాయంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
టేక్మాల్: వ్యవసాయంలో కష్టపడే రైతులకు నష్టాలు అధికం. సీజన్ ముంచుకొస్తుందంటేనే రైతన్నలకు గుండె దడ పుట్టేది. పెట్టుబడికి చిల్లిగవ్వ లేక నానా తంటాలు పడేవారు. గత సీజన్ పంటంతా ఏకంగా వడ్డీలకు, అప్పులు చెల్లించడానికే సరిపోయేవి. చాలీచాలని లాభాలు కాస్త కుటుంబ పోషణకు సరిపోగా తదుపరి పంట పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు మిగిలేవి కావు. దీంతో దిక్కు తోచని స్థితిలో అప్పులు చేయాల్సి వచ్చేది. దీంతో రైతులు చేసేది లేక విముక్తి కోసం ఆత్మహత్యలు చేసుకునే గడ్డు పరిస్థితులు గత పాలకుల సమయంలో కోకొల్లలు. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి సంస్కరణలు తీసుకువచ్చారు. రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో పెట్టుబడి సాయం అందించడానికి గత యేడాది మే 10వ తేదీన రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. పంటకు ఎకరానికి రూ.4వేల చొప్పున యేడాదికి రూ.8వేలు పెట్టుబడి సాయాన్ని అందించి రైతు అప్పులపాలు కాకుండా రుణవిముక్తులను చేశారు. మరో అడుగు ముందుకు వేసి వచ్చే పంట పెట్టుబడికి ఎకరానికి రూ.5వేల చొప్పున యేడాదికి రూ.10వేలు ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ సన్నద్ధమవుతుంది.
టేక్మాల్ మండలంలో మొత్తం 10,196 మంది రైతులు ఉన్నారు. రైతు బంధు పథకం పెట్టుబడి సాయాన్ని మొదట రైతుకు చెక్కు రూపంలో అందజేశారు. అయితే యాసంగి సాయాన్ని అందించే సమయానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉండటంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమచేయడానికి నిర్ణయించింది. ఇందుకోసం రైతులు ముందుగా వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా 9,514 మంది రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోగా రూ.7,96,66,670 పెట్టుబడి సాయం అవసరమైంది. 8716 మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.7,46,90,420 జమ చేశారు. మిగిలిన 798 మందికి రూ.49,76,250 జమచేయాల్సి ఉంది. ట్రెజరీ స్థాయిలో ఉండటంతో మిగిలిన 798 మంది రైతులకు కూడా త్వరలోనే బ్యాంకు ఖాతాలో పెట్టుబడి సాయం జమ అవుతుంది. మరో 682 మంది రైతుబంధు కు దరఖాస్తు చేసుకోలేదు. ఇందులో ప్రధానంగా విదేశాలు, ఇతరప్రాంతాల్లో ఉన్నవారు, భూములను అమ్మివేసినవారు ఇతరత్ర కారణాలతో దరఖాస్తు చేసుకోలేకపోయారు. రైతులకు అండగా ఉంటూ సర్కార్ సాయాన్ని అందజేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...