సమస్యల పరిష్కారానికే ప్రజావాణి


Tue,February 12, 2019 12:55 AM

మెదక్ మున్సిపాలిటీ: సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నుంచి 10 ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు.
- మెదక్ పట్టణంలోని వీరహనుమాన్ కాలనీకి చెందిన యాదాగౌడ్ తన కుమార్త వరలక్ష్మిని 2004 రంగారెడ్డి జిల్లా నిమ్మల వేణుగోపాల్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహం సమయంలో కట్నం కింద రూ. 2 లక్షలు, 5 తులాల బంగారంతో పాటు వస్తువులను ఇచ్చారు. అలాగే తన రెండో కుమార్తె జ్యోతి వివాహ సమయంలో అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయగా మరో రూ.2లక్షలు అదనంగా ఇచ్చాను. తన అల్లుడుపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
-శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన తాళ్ళపల్లి లావణ్య అలియాస్ రజిత తనకు 2008లో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తాళ్ల ప్రేమ్‌తో వివాహం జరిగింది. పెండ్లి సమయంలో తన తల్లిదండ్రులు కట్న కానుకల కింద ఆరున్నర తులాల బంగారం, రూ.1.80 లక్షల నగదుతో పాటు ఇతర సామగ్రి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం అయిన నాలుగేండ్లు బాగానే ఉన్నామని, తమకు ఇద్దరు సంతానమని, గత మూడు సంవత్సరాల నుంచిఅదనపు కట్నం కోసం భర్త, అత్త రూ.లక్ష తీసుకురమ్మని వేధిస్తే ఆడబ్బులు తన భర్తకు ఇచ్చాను. ఆ డబ్బులను తన చెల్లెలికి ఇచ్చాడని దాని తర్వాత కొన్ని రోజులు బాగానే చూసుకున్నాడు. ఆ తరువాత మళ్లీ అదనపు కట్నం కోసం నన్ను, నా తల్లిదండ్రులను బాధ పెట్టాడని ఇదే క్రమంలో కొన్ని నెలల నుంచి భర్త కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహ్మద్‌గర్ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై నా భర్తను అడుగగా నన్ను కట్టు బట్టలతో బయటకు వెళ్లగొట్టాడు. ఆ తరువాత నా భర్త మేన బామ్మర్ది నీరుడి పోచయ్య, మేనమామ సాయిలు సహాయంతో వివాహిత అయిన బట్టి సునీతతో కొమురవెళ్లి దేవస్థానంలో దండలు మార్చుకుని వివాహం చేసుకుని, తనని మా ఇంటికి తీసుకువచ్చాడు. కావున తన భర్తపై, బట్టి సునీతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...