చండీయాగం ప్రారంభం


Tue,January 22, 2019 12:28 AM

గజ్వేల్, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ దంపతులు నిర్వహిస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీయాగం సోమవారం ఉదయం 11గంటలకు ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ప్రారంభం కాగా, రుత్వికులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లింది. కేసీఆర్ దంపతులు గణపతిపూజ, పుణ్యహవచనం, రుత్వికహవనం, యాగశాల ప్రదేశం, గోపూజ కార్యక్రమాలు నిర్వహించారు. పట్లూరి సోమయాజులు, నిత్యాగ్నిగోత్ర అవధానులు, నరేంద్రకాప్రా, విశాఖ శారద పీఠం స్వరూపనందేంద్ర సరస్వతీస్వామి, భద్రకాళి శేషు, ఓరుగంటి గోపాలశర్మలతో పాటు ఫణిశశాంక్ జ్యోతికృష్ణశర్మ, పురాణం మహేశ్వరశర్మ, సుమారు 300మంది రుత్వికులు పాల్గొన్నారు. యాగశాలలు, అమ్మవారి విగ్రహం, హోమాల ఏర్పాటుతో ఆ క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉద యం, సాయంత్రం జరిగిన యాగ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ దంపతులు నిర్వహించగా, టీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ హరీశ్ ప్రభాకర్ మల్లారెడ్డి, ఏనుగు రవీందర్ జనార్దన్ పద్మాదేవేందర్ ఎంపీ కొత్త ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యు లు, బంధువులు కూడా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ఆధ్యాత్మికతను సంతరించుకున్న వ్యవసాయ క్షేత్రంసహస్ర చండీయాగంతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. భారీ బందోబస్తు ఏర్పాటు యాగం నిర్వహణకు ముందస్తుగానే కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేపట్టారు. ముం దుగా నిర్ణయించిన వారికే యాగానికి ప్రవేశం కల్పించారు. పరిసర ప్రాంతాలకు అనుమతి లేనివారిని ఎవ్వరినీ రానివ్వలేదు. టీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ గజ్వేల్ చెందిన మున్సిపల్ చైర్మన్ భాస్కర్, వంటేరు ప్రతాప్ డాక్టర్ యాదవరెడ్డిలతోపాటు ఎర్రవల్లి వీడీసీ సభ్యులు కిష్టారెడ్డి, బాల్ తదితరులు యాగక్షేత్రానికి వెళ్లి దర్శించుకున్నారు.

184
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...