పది నెలల్లో ‘కాళేశ్వరం’ పూర్తి


Tue,January 22, 2019 12:27 AM

-సస్యశామలం కానున్న లక్షల ఎకరాలు
-6 వేల మంది మృతి చెందిన రైతులకు రైతుబంధు వర్తింపు
-12 వేల కోట్లతో ప్రపంచస్థాయి రోడ్డు
-టీఆర్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుందాం
-రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్
మనోహరాబాద్ : పది నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని, దీంతో లక్షల ఎకరాలు సస్యశామలం కానున్నాయని రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్ అన్నారు. మనోహరాబాద్ అతిథి గృహంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతులను రాజుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న పనులన్నింటినీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రారంభమయ్యాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పది నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో ఎండిపోయిన చెరువులు, వాగులు జలకళను సంతరించుకుంటాయన్నారు. అదే విధంగా రైతు బంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. ఇప్పటికీ తెలంగాణలో వివిధ కారణాలతో మృతి చెందిన 6 వేల మంది రైతులకు రూ. 5 లక్షల చొప్పున రైతుబంధు ద్వారా అందాయన్నారు. అదే విధంగా సంగారెడ్డి నుంచి రూ.12 వేల కోట్లతో ప్రపంచస్థాయి రోడ్డు రానున్నందని తెలిపారు. గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని, ప్రజల దెబ్బకు కాంగ్రెస్ భూస్థాపితమైపోయిందన్నారు. కాంగ్రెస్ నాయకులంతా టీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై భారీగా టీఆర్ చేరుతున్నారన్నారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు. టీఆర్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ మండల అధ్యక్షుడు ర్యాకల శేఖర్ రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ నాగిరెడ్డి పాల్గొన్నారు.

162
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...