టీఆర్ గ్రామాల అభివృద్ధి సాధ్యం


Tue,January 22, 2019 12:26 AM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ: టీఆర్ బలపర్చిన అభ్యర్థులు గెలిస్తేనే గ్రామాల్లో మరింత వేగవంతంగా అభివృద్ధ్ది సాధ్యమవుతుందని ఎమ్మెల్యే భూపాల్ అన్నారు. సోమవారం నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట గ్రామంలో టీఆర్ బలపర్చిన అభ్యర్థి కమ్మరి జగదీశ్వర్ మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. గ్రామంలో సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని, తాను బలపర్చిన అభ్యర్థిని గెలిపించి తనకు కానుకగా ఇవ్వాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. నిజాంపేటను అన్ని విధాల అభివృద్ధ్ది చేసే బాధ్యతను తానే తీసుకుంటానన్నారు. నిజాంపేట గ్రామంలో అవినీతి అక్రమాలు లేకుండా పేదల బతుకులు మారాలంటే టీఆర్ బలపర్చిన అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేకు స్వాగతం పలుకడంతో పాటు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ వెంకట్రామ్ కూడా ఉన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...