బాధిత కుటుంబానికి పరామర్శ


Tue,January 22, 2019 12:26 AM

రామాయంపేటరూరల్ : రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామానికి చెందిన వేముల సుధీర్(36) హైదరాబాద్ మాదాపూర్ రెండు రోజులక్రితం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న టీఆర్ రాష్ట్ర నాయకుడు దేవేందర్ సోమవారం ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దామరచెర్వు గ్రామానికి చెందిన వేముల సుధీర్ వజ్రాల వ్యాపారి అయిన వ్యక్తి దగ్గర కారు డ్రైవర్ పని చేస్తున్నాడు. అనుమానాస్పదంగా రెండు రోజుల క్రితం మాదాపూర్ భవనం పైనుంచి పడి మృతిచెందాడు. కాగా సోమవారం గ్రామంలో సుధీర్ అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ రాష్ట్ర నాయకుడు దేవేందర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు టీఆర్ పట్టణ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, గ్రామ మాజీ సర్పంచ్ పాకాల రామారావు, బాదె చంద్రం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

429
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...