పోలింగ్ బూత్ కలెక్టర్ తనిఖీ


Tue,January 22, 2019 12:26 AM

హవేళిఘణపూర్: గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న మండల కేంద్రమైన హవేళిఘణపూర్, మండల పరిధిలోని బూర్గుపల్లి, వాడి గ్రామాల్లో ఎన్నికల పోలింగ్ శాతాన్ని కలెక్టర్ ధర్మారెడ్డి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులను పోలింగ్ జరుగుతున్న తీరు, పోలింగ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ అన్ని వసతులు కల్పించడం జరిగిందన్నారు.
బందోబస్తును పర్యవేక్షించిన
అదనపు ఎస్పీ నాగరాజు
మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా మండల పరిధిలోని సర్దన పోలింగ్ కేంద్రం వద్ద భద్రత ఏర్పాట్లను జిల్లా అదనపు ఎస్పీ నాగరాజు పర్యవేక్షించారు. ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భారీ బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సహకారంతో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు బందోస్తుబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...