మండలంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు


Tue,January 22, 2019 12:25 AM

తూప్రాన్ రూరల్ : మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం విద్యుత్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ చెందిన విజిలెన్స్ అధికారుల బృందం సభ్యులతో పాటు తూప్రాన్ విద్యుత్ డివిజన్ తూప్రాన్, రామాయంపేట ఏడీఈలు వీరారెడ్డి, సంతోశ్ తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, వెల్దూర్తి, శివ్వంపేట, రామాయంపేట, నిజాంపేట మండలాలకు చెందిన ఏఈలు వెంకటేశ్, రాధాకృష్ణ, ప్రసాద్, గణేశ్, పెంట్యానాయక్, వరహాలబాబులతో పాటు లైన్ ఇన్స్ లైన్ విద్యుత్ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ విద్యుత్ మీటర్లను తనిఖీ చేశారు. మండలంలోని పోతరాజుపల్లి, బ్రాహ్మణపల్లి, పడాల్ తదితర గ్రామాల్లో గృహవసరాలు, కమర్షియల్ వాడుతున్న విద్యుత్ మీటర్లను వారు పరిశీలించారు.విద్యుత్ శాఖాధికారులు మీటర్లకు సీల్డ్ వేసిన తీరు..? మీటర్లకు వేసిన సీల్డ్ వినియోగదారులు తొలిగించారా..? మీటర్ తక్కువ రీడింగ్ నమోదు కావడానికి ఏవైన వైర్లను దొంగతనంగా బిగించారా..? మీటర్ లేకుండా దొంగతనంగా విద్యుత్ వాడుతున్నారా..? మీటర్ రీడింగ్ సక్రమంగా కొనసాగుతున్నాయా..? లేదా..?తదితన అంశాలపై వారు ఇంటింటికీ తిరుగుతూ విద్యుత్ మీటర్లను నిశితంగా పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఏఈ చంద్రశేఖర్ పాటు తూప్రాన్ డివిజన్ పరిధిలోని విద్యుత్ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...