ఎన్నికలను సజావుగా నిర్వహించాలి


Sun,January 20, 2019 11:40 PM

టేక్మాల్ : గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో అధికారులు జాగ్రత్త వహించాలని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. టేక్మాల్ మండలంలో తొలి విడుత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సిబ్బందిని మండల పరిధిలోని ఆయా గ్రామాలకు కేటాయించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మండల కేంద్రమైన టేక్మాల్‌లో సిబ్బందిని కేటాయించే కార్యక్రమం చేపట్టారు. మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 24 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా పంచాయతీలకు అవసరమైన సిబ్బందిని కేటాయించి సంబంధిత పంచాయతీలకు రూట్ల వారీగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో పోలింగ్ సిబ్బందిని తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

అలాగే మెదక్ ఆర్డీవో వీరబ్రహ్మచారి సైతం ఎన్నికల సిబ్బంది కేటాయింపు కార్యక్రమాన్ని సమీక్షించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లావ్యవసాయ శాఖ అధికారి పరశురాం నాయక్, తహసీల్దార్ గ్రేసీబాయి, ఎంపీడీవో శైలేశ్, సూపరింటెండెంట్ విష్ణువర్ధన్ అధికారులు చంద్రశేఖర్, మిజ్బావుద్దీన్, రాంప్రసాద్, నాగరాజు, నజీర్, మాధవాచార్యులు, బాలకృష్ణ, సాజీద్ తదితరులు ఉన్నారు.

అల్లాదుర్గంలో...
అల్లాదుర్గం : జిల్లాలో జరుగుతున్న మెదటి విడుత పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. ఆదివారం మండల కేంద్రమైన అల్లాదుర్గంలో ఆయన ఎన్నికల సామగ్రి పంపిణీని పర్యవేక్షించారు. ఆయా చోట్ల పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది జాబితాను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులకు హాజరు కాని సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వీరబ్రహ్మచారి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి, మండల ప్రత్యేక అధికారి సుధాకర్, ఎంపీడీవో విద్యాసాగర్, తహసీల్దార్ రేణుక చవాన్, తదితరులు పాల్గొన్నారు.

పాపన్నపేటలో...
పాపన్నపేట : మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ధర్మారెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీవో వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో రాణిలను ఎన్నికలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. 54 మంది సిబ్బంది పాపన్నపేటకు అదనంగా వచ్చినట్లు తెలుసుకున్నారు. వారిని పిలిపించి మీకు ఎక్కడ డ్యూటీలు వేశారంటూ కలెక్టర్ ఆరా తీయగా సిబ్బంది మొదటి విడుతగా పాపన్నపేట అంటూ ఆర్డర్లు ఇచ్చారని తర్వాత ఫోన్లతో కొంతమందికి టేక్మాల్, పెద్దశంకరంపేట, రేగోడ్, అల్లాదుర్గం వెళ్లాలంటూ సమాచారం ఇవ్వడంతో ఎక్కడ వెళ్లాలో తెలియక పాపన్నపేటకు వచ్చామని పోలింగ్ సిబ్బంది వెల్లడించడంతో వారిని రెండోవిడుతగా వచ్చిన ఆర్డర్ల స్థానానికి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవో రాణిని ఆదేశించారు.

208
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...