ఆలోచించి ఓటెయ్యండి


Sun,January 20, 2019 12:13 AM

హవేళిఘనపూర్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని, హవేళిఘనపూర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ అన్నారు. మండల కేంద్రం హవేళిఘనపూర్ టీఆర్ బలపర్చిన అభ్యర్థి సునీతాసాయిలుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం మండల పరిధిలోని వాడి, దూప్ తండా, సర్ధన గ్రామాల్లోని ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ పార్టీ అధికారంలో ఉన్నందున సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. హవేళిఘనపూర్ ఇప్పటికే 40 డబుల్ ఇండ్లు మంజూరు చేయగా అవి పూర్తి కావస్తున్నాయని, మరో 40 ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. సొంత స్థలం ఉంటే ఇల్లు నిర్మించి ఇస్తామని, లబ్ధిదారుడు ఇల్లు నిర్మించుకుంటే రూ.5లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ప్రతిఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీకిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, టీఆర్ జిల్లా నాయకులు మాణిక్యరెడ్డి, టీఆర్ మండల అధ్యక్షుడు అంజాగౌడ్, శ్రీనివాస్ సతీశ్ మేకల సునీతాసాయి, దుర్గేశ్, సిద్ధిరెడ్డి, రాంచంద్రారెడ్డి, గణపతి, ఎర్ర నారాయణ, రాజేశ్వర్ శేఖర్, సత్యంగౌడ్ పాల్గొన్నారు.

196
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...