ఓటు హక్కును వినియోగించుకోవాలి


Sun,January 20, 2019 12:08 AM

మెదక్ మున్సిపాలిటీ: ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వజ్రాయుధమని ఎస్పీ చందనదీప్తి అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశాన్ని జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుతో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు ప్రాధాన్యత చాలా గొప్పదని తెలిపారు. ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే సంబంధిత పోలీస్ సమాచారం ఇవాలని, లేదా 100కు డయల్ చేయాలని అన్నారు. మద్యానికి, డబ్బులకు మరే ఇతర వస్తువులకు బానిసలు కావద్దని, నిజాయితీగా, నిర్భయంగా ఓటు వేయాలన్నారు.

ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయాలని, ఒకవేళ ఎవరైన మద్యం విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. అంతేకాకుండా స్నేహపూరిత వాతావరణంలో పోటీపడాలన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పోలీస్ బలగాలు గ్రామాలకు చేరుకున్నాయని, అధికారుల నేతృత్వంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల నిర్వహణ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తూ ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికలకు సంబంధించిన చిన్న సంఘటన జరిగినా, ఫిర్యాదు వచ్చిన వీడియోగ్రాఫ్, సీసీ కెమెరాల పుటేజీల డాక్యుమెంటేషన్ తప్పనిసరిగా ఉండాలని అధికారులు అందరు చాలా జాగ్రత్తతో అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయి నిఘా ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నాగరాజు, మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, ఎస్బీ సీఐ మల్లికార్జున్ ఐటీకోర్ సీఐ గోవర్ధనగిరీ, డీసీఆర్ సీఐ చందర్ జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...