రెండో విడుతలో 38 మంది సర్పంచుల ఏకగ్రీవం


Sun,January 20, 2019 12:08 AM

నర్సాపూర్, నమస్తేతెలంగాణ: మెదక్ జిల్లాలో ఈ నెల 25న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నర్సాపూర్ డివిజన్ 5 మండలాలతో పాటు వెల్దుర్తి మండలంలో కలిపి 170 పంచాయతీలకు 1444 వార్డు సభ్యులకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా 38 గ్రామాల్లో ఇప్పటికే సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. దాంతో 132 గ్రామపంచాయతీలకు ఈ నెల 25న రెండో విడుత ఎన్నికలు జరుగనున్నాయి. నర్సాపూర్ మండలంలో 9 గ్రామపంచాయతీలు, శివ్వంపేట మండలంలో 11 గ్రామపంచాయతీలు, కౌడిపల్లి మండలంలో 10 గ్రామపంచాయతీలు, చిలిపిచెడ్ మండలంలో 4 గ్రామపంచాయతీలు, వెల్దుర్తి మండలంలో 4 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 1444 వార్డులకు 2051 మంది సభ్యులు బరిలో ఉన్నారు. అయితే శివ్వంపేట మండలంలో 37 పంచాయతీలలో మొత్తం 312 వార్డులు ఉండగా 86 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

దాంతో 226 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 560 మంది బరిలో ఉన్నారు. కొల్చారం మండలంలో 21 గ్రామపంచాయతీల్లో 192 వార్డులు ఉండగా.. 21 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 171 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 418 మంది బరిలో ఉన్నారు. వెల్దుర్తి మండలంలో 25 గ్రామపంచాయతీలలో 260 వార్డులు ఉండగా 51 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 209 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 512 మంది వార్డు సభ్యులకు బరిలో ఉన్నారు. చిలిపిచెడ్ మండలంలో 14 గ్రామపంచాయతీల్లో 156 వార్డులు ఉండగా.. 48 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 108 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 224 మంది బరిలో ఉన్నారు. కౌడిపల్లి మండలంలోని 19 గ్రామపంచాయతీల్లో 248 వార్డులు ఉండగా.. 107 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 141 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 286 మంది బరిలో ఉన్నారు. నర్సాపూర్ మండలంలో 34 గ్రామపంచాయతీల్లో 276 వార్డులు ఉండగా 104 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 172 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 406 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
చేగుంట: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తూప్రాన్ ఆర్డీవో టి.శ్యాంప్రకాశ్ పేర్కొన్నారు. శనివారం మండలకేంద్రమైన చేగుంటలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పని సరిగా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వెళ్లేవారికి ప్రాసిక్ చేసి సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఖర్చులకు సంబందించి మేజర్ గ్రామపంచాయతీకి 5వేల జనాభా గల గ్రామాలకు రూ. 2లక్షల 50వేలు, అంతుకు తక్కువగా ఉన్న జనాభాగల గ్రామాలకు రూ. లక్షా 50వేలకు మించి ఉండరాదన్నారు. బ్యాంకుల నుంచి డ్రా చేసిన ప్రతి పైసాకు లెక్కలు రాసి, ఎన్నికలు అయిన 45రోజుల్లో ఖర్చులకు సంబంధించిన రిజిస్టర్లను ఎంపీడీవో కార్యాలయ అధికారులకు సమర్పించాలని ఆర్డీవో శ్యాంప్రకాశ్ సూచించారు.

డబ్బు రూపంలో గాని, మద్యంగాని, ఇతరత్ర వస్తువులతో ఓటర్లను మభ్యపెటట్టినా ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తుందన్నారు. ప్రభుతానికి సంబంధించిన కార్యాలయాలకు ఎక్కడ కూడా అభ్యర్థులకు సంబంధించిన పోస్టర్లను అతికించరాదన్నారు. ప్రైవేటు వ్యక్తుల గోడలకు పోస్టర్లు అతికించినప్పుడు తప్పనిసరిగా ఇంటి యాజమని అనుమతి పొందలన్నారు. ఈ నెల 20నుంచి22 సాయంత్రం 3గంటల వరకు నామనేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు స్థానిక రాజకీయ నాయకులు,పోటీ చేసే అభ్యర్థులు సహకరించాలని, నిబంధనలు ఉల్లఘించిన వారిపైన చర్యలు తప్పవని ఆర్డీవో తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ రఘు, ఎన్నికల వ్యయం(ఎక్స్పెండిచర్) అధికారులు జి. కిరణ్ టి. నిర్మల ఉన్నారు.

ఘనంగా టీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు
హవేళిఘణపూర్: మండల పరిధిలోని కూచన్ గ్రామంలో శనివారం టీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కొంపల్లి సుభాష్ దేవాగౌడ్, మాజీ సర్పంచ్ మహేందర్ ఎంపీటీసీ ప్రియాంకకిష్టాగౌడ్, శేఖర్ ఈర్ల రమేశ్, యాదగిరి, పరుశురామ్, బాలు పాల్గొన్నారు.

166
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...