జోరుగా కొనసాగుతున్న రెండో విడుత ్ర పచారం


Sun,January 20, 2019 12:07 AM

కొల్చారం : రెండోవిడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నర్సాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. నియోజకవర్గంలోని నర్సాపూర్, చిలిపిచెడ్, శివ్వంపేట, కౌడిపల్లి, కొల్చారం, వెల్దుర్తి మండలాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలాలు ఉన్నాయి. కాగా హత్నూర మండలంలో మొదటి విడుతలోనే ఈ నెల 21వ తేదీన ఎన్నికలు జరుగనుండగా, మిగతా మండలాల్లో రెండో విడుత ఎన్నికలు ఈ నెల 25వ తేదీన జరుగనున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 208 సర్పంచ్ స్థానాలు ఉండగా, 44 సర్పంచ్ స్థానాల ఎన్నికల ఏకగ్రీవమయ్యాయి. ఇంకా 164 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, 444 మంది పోటీలో ఉన్నారు. అలాగే 1778 వార్డులు ఉండగా, 529 స్థానాలు ఏకగ్రీవం కాగా ఇంకా 1249 వార్డులకు ఎన్నికలు జరుగాల్సి ఉంది. వార్డు సభ్యులకు 2685 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సర్పంచ్ పదవులకు ఏకగ్రీవాల్లో అత్యధికంగా శివ్వంపేట మండలంలో 11 సర్పంచులు ఉండగా, కొల్చారం మండలంలో ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు. సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో మొదటి విడుతలోనే ఎన్నికలు జరుగనున్నందున ఇక్కడ ప్రచారం ముగియగా, మిగతా మండలాల్లో ఈ నెల 25వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఏకగ్రీవం అయిన సర్పంచ్, వార్డు సభ్యులంతా టీఆర్ మద్దతుదారులే. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో టీఆర్ శ్రేణులను సమావేశపర్చి అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యే మదన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇప్పటికే మొదటి విడుత ఎన్నికలు జరుగనున్న హత్నూర మండలంలో ప్రచార పర్వం ముగియగా రెండోవిడుత ఎన్నికలు జరుగనున్న మండలాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఎన్నికల అధికారులు ఈ నెల 17వ తేదీననే గుర్తులు కేటాయించడంతో ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. టీఆర్ మద్దతు దారులుగా నిలిచిన వారికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.

167
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...